ఇప్పటికీ బాలీవుడ్‌లో స్టైలిష్ నటీమణుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కరీనాకపూర్ ఖాన్ పేరును అసలు విడిచిపెట్టలేం. ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్స్ తో జనాలను వావ్ అనిపిస్తూనే ఉంటారు కరీనా. రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా, కేజువల్ ఔటింగ్ అయినా బెబో ఎప్పుడూ గ్లామరస్‌గానే కనిపిస్తుంటారు. ఆమె డ్రస్సింగ్ సెన్స్ గురించి ఆమె కొడుకులు జె, తైమూర్ ఎప్పుడైనా ఏమైనా చెప్పారా అని కరీనాని అడిగితే గట్టిగా నవ్వేశారు. దీని గురించి మాట్లాడుతూ ``జెహంగీర్ అలీ ఖాన్, తైమూర్ ఇద్దరూ చాలా చిన్న పిల్లలు. వాళ్లకు ఇంకా స్టైల్ గురించి తెలియడం లేదు. జెహంగీర్‌కి కూడా వాటి గురించి అవేర్‌నెస్ లేదు`` అని అన్నారు. కరీనాకపూర్ తన స్టైల్ కోసం, కావాల్సినంత టైమ్‌ని స్పెండ్ చేస్తారా అని అడిగితే ``ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను. కానీ అదేదో ప్రత్యేకంగా చేసినట్టు ఉండదు. అలాగని ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో ఉండాలని తాపత్రయపడను. చాలా కేజువల్‌గా ఉంటాం. నేనన్నా అప్పుడప్పుడూ ట్రెండ్‌ని పట్టించుకుంటాను. సైఫ్ అయితే ఐదేళ్లుగా ఒకే ట్రాక్ ప్యాంట్స్ ని వాడుతున్నారు. దీన్ని ఎన్నేళ్లుగా వాడుతున్నారో గుర్తుందా అని నేను పనిగట్టుకుని గుర్తుచేసేదాకా ఆయన ఇంకో పెయిర్ తీసుకోరు`` అని అన్నారు.
అంతే కాదు, సైఫ్ చాలా స్టైలిష్ మేన్ అనిఅంటారు కరీనా. ``కొన్నిసార్లు సైఫ్ వేసుకునే టీ షర్టుల్లో చిన్న చిన్న హోల్స్ కూడా ఉంటాయి. అది చినిగిపోయింది అని నేను చెప్పినా ఆయన పట్టించుకోరు. చినిగితే ఏంటి? అన్నట్టు వెళ్తుంటారు. దాన్ని కూడా జనాలు ఫ్యాషన్‌గానే ట్రీట్ చేస్తారు. కొంత మంది ఫ్యాషన్‌ని ఫాలో కాకపోయినా, జనాలు వాళ్లని స్టైలిష్ పర్సన్ గానే చూస్తారు. సైఫ్ అలాంటి వ్యక్తి`` అని అన్నారు. కరీనాకపూర్ ప్రస్తుతం `ది క్రూ` సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెతో పాటు కృతి సనన్, టబు నటిస్తున్నారు. ముగ్గురు ఎయిర్ హోస్టెస్, వారి మధ్య జరిగే సరదా సంభాషణలు, ఆ ముగ్గురి జీవితాల్లోనూ ఎదురైన చేదు అనుభవాలు, వాటిని వారు అధిగమించిన తీరుతో సినిమా తెరకెక్కుతోంది.